2023-24 పద్దు అంకెల కూర్పు ఎలా ఉండనుంది? - 2023 ap budget

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 15, 2023, 10:21 PM IST

PRATHIDWANI: వైకాపా ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టబోతున్న ఆఖరి బడ్జెట్ ఎలా ఉండబోతోంది ? రాష్ట్రంలో ఇప్పుడు అందరి చూపు దీని వైపే ? ఒకవైపు కేటాయింపులు, ఖర్చులకు పొంతన లేని పరిస్థితి. మరొకవైపు అప్పులకుప్పలు, అమలు కాని హామీలు. రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై ఇప్పటికే తీవ్రస్థాయిలో ఉన్న విమర్శలు, ఆక్షేపణలు దాటి.. 2023-24 బడ్జెట్‌ను ఎలా తీర్చిదిద్దనున్నారు? సంక్షేమంతో పాటు.. ప్రాధాన్యతా రంగాలకు కేటాయింపులు ఎలా ? పైగా అప్పుడు పుడితేనే రోజు గడిచేది అని నాలుగేళ్ల వైకాపా పాలనపై కాగ్ అక్షింతలు వేసిన వేళ..., నెలనెల ఉద్యోగుల జీతాలు ఇవ్వడడానికి కూడా కిందా మీదా పడుతున్న తరుణంలో... ఈ బడ్జెట్‌లో ఏం సమాధానాలు చెప్పనున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ చేపట్టింది. ఈ చర్చలో సీనియర్ ఆర్ధిక, సామాజిక విశ్లేషకులు నీలాయపాలెం విజయ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు నేతి మహేశ్వరరావులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.