రైతుల జీవితాల్లో జగనన్న వెలుగు నింపుతున్నాడా?
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 7, 2023, 9:20 PM IST
Prathidhwani: రాష్ట్రంలో కరవు పెద్దగా లేదా? పగటిపూట పంటపొలాల్లో సమృద్ధిగా వ్యవసాయ విద్యుత్ వస్తోందా? రైతు భరోసా కేంద్రాలు రాకతో అన్నదాతలు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారా? పంటల బీమాతో నష్టపోయిన రైతుల జీవితాల్లో జగనన్నవెలుగు నింపుతున్నాడా? అమూల్ రాకతో ఆంధ్రావనిలో క్షీరవిప్లవం వచ్చినంత సంతోషంగా పాడి రైతులున్నారా? ముఖ్యమంత్రి జగన్ ప్రసంగంలోని ఆణిముత్యాలు విన్నాక చాలామందిలో తలెత్తుతున్న సందేహాలివి. జగన్ చెబుతున్నట్లు రాష్ట్రంలో నిజంగానే ఈ పరిస్థితి ఉందా? దీనికి కొనసాగింపుగానే ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఈ సీజన్ ముగిసేలోపు పరిహారం చెల్లిస్తున్న ప్రభుత్వం మాది అన్నారు సీఎం జగన్. రైతులకు ఆ లబ్ది చేకూరుతోందా? మొత్తం మీద చూస్తే నాలుగున్నరేళ్లలో అక్షరాల లక్షా 75వేల కోట్లు రైతన్నలకు అందించిన ప్రభుత్వం మాదే అంటున్నారు జగన్. ముఖ్యమంత్రి చెప్పినవన్నీ నిజమే అయితే వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడిన వారిలో ఎంతశాతం మంది రానున్న ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేసే అవకాశం ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.