నేర నేతలకు అడ్డుకట్ట పడుతుందా? - ఏపీ నేటి ప్రతిధ్వని

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2023, 9:12 PM IST

Prathidhwani: దేశంలో ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలంటే పాపాలభైరవులు పదవుల్లోకి రాకూడదు. చట్టాల్ని కాలదన్నేవారు చట్టసభల సభ్యులు కాకూడదు. కానీ నేటి రాజకీయాల్ని చూస్తే భిన్నమైన పరిస్థితి. హత్యలు, అత్యాచారాలు, ఆర్థిక అక్రమాల కేసుల్లో నిందితులూ ఎన్నికల్లో నిలుస్తున్నారు. సామ దాన భేద దండోపాయాలతో గెలుస్తున్నారు. నెత్తిన ఉన్న కేసుల్లో నేరాభియోగాలు రుజువైతే కటకటాల్లో మగ్గాల్సిన వారు.. పాలకులై జనం నెత్తిన ఊరేగుతున్నారు. ఈ నేరనేతలకు అడ్డుకట్ట దిశగా కీలకతీర్పు వెలువరించింది సుప్రీం కోర్టు. ప్రజాప్రతినిధులపై ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి హైకోర్టుల్లో ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 

దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై కేసుల విచారణకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని సుప్రీం గతంలోనే ఆదేశించింది. అది ఎందుకు ముందుకు సాగలేదు.. తాజా ఉత్తర్వుల ప్రాధాన్యత ఏమిటి?  పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సమర్థంగా, ప్రభావశీలంగా పనిచేయడానికి ప్రజాప్రతినిధులపై నమ్మకం ముఖ్యం అంది సుప్రీంకోర్టు. నేరచరిత్ర ఉన్నవారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులైతే దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.