Prathidhwani: నాలుగేళ్లలో ముస్లింలకు వైసీపీ సర్కార్ చేసిందేమిటి? - రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ వర్గాల వివరాలు
🎬 Watch Now: Feature Video
Prathidhwani: మైనార్టీల సబ్‌ప్లాన్‌ను పారదర్శకంగా అమలు చేస్తాం. వక్ఫ్, ముస్లిం ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. ముస్లిం మైనార్టీ చెల్లెమ్మల వివాహానికి లక్ష రూపాయలు.. హజ్ యాత్రకు సాయం, ఇమామ్‌లకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి ఇళ్లు కట్టిస్తాం. రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ వర్గాలకు సంబంధించి ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఇలా ఎన్నో అంశాలు పొందుపరిచింది వైసీపీ. ప్రతి ఎన్నికల సభలో వాటిని పదేపదే వల్లె వేశారు. మరి అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో ఎన్నింటిని నెరవేర్చారు? రాష్ట్రంలో 8.8శాతం జనాభా ఉన్న ముస్లింలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆ వర్గం పెద్దలే వాపోతుండడానికి కారణం ఏమిటి? మొత్తంగా చూస్తే... నాలుగేళ్ల క్రితం ఏ నమ్మకంతో ముస్లిం మైనార్టీలు వైసీపీని ఆదరించారు? ఆ నమ్మకాన్ని జగన్ ఎంతవరకు నిలబెట్టుకున్నట్లు? ముస్లింలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. దానివల్ల సామాన్య ముస్లింలకు కలిగిన మేలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.