Prakasam Missing Boy Case Ends in Tragedy : నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు.. పంటపొలాల్లో శవమై.. - ఏపీ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 4, 2023, 10:23 AM IST
Prakasam Missing Boy Case Ends in Tragedy : ప్రకాశం జిల్లాలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ఏడాదిన్నర చిన్నారి సాత్విక్.. ఎట్టకేలకు గ్రామ సమీపంలోని పంట పొలాల్లో నిర్జీవంగా లభ్యం అయ్యాడు. చిన్నారి మృతదేహాన్ని గ్రామానికి చెందిన కొందరు పశువుల కాపరులు గ్రామ పంట పొలాల్లో గుర్తించారు.
చంద్రశేఖరపురం మండలంలోని చింతలపాలెం గ్రామంలో తల్లి పక్కలో నిద్రిస్తున్న ఏడాదిన్నర బాలుడు సాత్విక్ నాలుగు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. కుమారుడు కనిపించటం లేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసుల బృందాలుగు ఏర్పాటై.. బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గత నాలుగు రోజులుగా ముమ్మర దర్యాప్తు చేపట్టినప్పటికీ ఎటువంటి ఆచూకీ లభించలేదు. రోజు మాదిరిగానే గ్రామంలోని పశువుల కాపరులు తమ పశువులను పొలానికి తోలుకెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా దుర్వాసన రావడంతో పరిసరాల్లో వెతకగా బాలుడి మృతదేహం కనిపించింది. బాలుడి మృదేహాన్ని గడ్డితో కప్పి ఉంచడానికి గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహం వద్దకు చేరుకున్న పోలీసులు.. అపహరణకు గురైన బాలుడు సాత్విక్గా నిర్ధారించారు. చిన్నారి సాత్విక్ను అపహరించిన వారే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేసి పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.