Pothina Mahesh comments పవన్ కల్యాణ్ కనపడితే తాడేపల్లి ప్యాలెస్ వణికి పోతుంది: పోతిన మహేష్ - Pawan Kalyan comments

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 13, 2023, 4:44 PM IST

Pothina Mahesh press meet పొత్తులుంటే ఓటమి తప్పదని సీఎం జగన్‌కి, వైసీపీ నాయకులకి అర్థమైందని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ ఒక్క మాట మాట్లాడితే మంత్రులు మొత్తం ఉలిక్కిపడి బయటికి వచ్చి ప్రెస్​మీట్​లు పెడుతున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ కనపడితే తాడేపల్లి ప్యాలెస్ ఎందుకో వణికి పోతుందని ఎద్దేవా చేశారు. వైసీపీకి దండం పెట్టి ఈ పార్టీలో తాము ఉండలేం.. ఇలాంటి నియంతృత్వ పాలన చూడలేదని ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారని, దీనిపై వైసీపీ మంత్రులు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. సజ్జల సలహాలతో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. సజ్జల అవినీతి సీఎం జగన్​ని మించి పోయాలా ఉందని, మీడియాలో సజ్జల గురించి అనేక గుసగుసలు వినపడుతున్నాయన్నారు. అధర్మ అవినీతి అరాచక పాలనకు ప్రతిరూపం సీఎం జగన్..  అని మహేష్ దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని లూటీ చేసి రాజశ్యామల యాగం చేస్తారా అని నిలదీశారు. సీఎం జగన్ ముమ్మాటికి కాపు వ్యతిరేకి పవన్ కల్యాణ్​పై స్పందిస్తున్న కాపు మంత్రులు కాపు ద్రోహులని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.