Police Seized Thousand Bikes in Kadapa: కడప టౌన్లో పదిరోజుల్లో వెయ్యి బైకులు సీజ్.. కారణం ఇదే! - Police Seized Thousand Bikes in Kadapa
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 24, 2023, 5:27 PM IST
Police Seized Thousand Bikes in Kadapa: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఇష్టానుసారం వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నారనే ఉద్దేశంతో వెయ్యి మంది యువతకు వైఎస్సార్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఈనెల 14 నుంచి 24వ తేదీ వరకు కడప నగరంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వెయ్యి ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పదిరోజుల పాటు వాహనాలను వారికి ఇవ్వకుండా.. పోలీసు పరేడ్ మైదానంలో ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు.
ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బైకు నడిపిన వారిని గుర్తించారు. వారందరినీ దాదాపు రెండు గంటల పాటు పరేడ్ మైదానంలో వారి వాహనాల వద్ద ఎండలోనే నిల్చో బెట్టారు. వాహనాలు నడిపిన యువకులు, మైనర్ల తల్లిదండ్రులను కూడా కౌన్సిలింగ్‌కు పిలిపించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వివరించారు. కడప నగరాన్ని సురక్షితమైన, ప్రమాద రహిత నగరంగా మార్చేందుకు చర్యలు మొదలు పెట్టామని ఎస్పీ తెలిపారు. మొదటి తప్పు కింద పట్టుబడిన వాహనాలను వదిలేస్తున్నామని.. మరోసారి ఇదే వాహనాలు చిక్కితే కేసులు పెట్టడంతో పాటు భారీ జరిమానా విధిస్తామని ఎస్పీ హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కూడా ప్రత్యేక డ్రైవ్ కొనసాగిస్తామని ఎస్పీ వెల్లడించారు.