అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు - కర్ణాటక మద్యం పోలీసులు స్వాధీనం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 13, 2024, 12:48 PM IST

Police Seized Illegal Karnataka Liquor: అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో అక్రమంగా తరలిస్తున్న 72 బాక్సుల కర్ణాటక మద్యాన్ని సెబ్ (Special Enforcement Bureau) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం టాటా ఏస్​లో మద్యం అక్రమ రవాణా (Liquor Illegal Transport) జరుగుతుందని ముందస్తు సమాచారం రావటంతో వాహనాన్ని చేధించి మద్యం స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

Police Arrested Accused of Illegal Liquor Transport: వాహనంలో 72 బాక్సుల్లో 6912 ప్యాకెట్లలో ఉన్న మద్యం విలువ రూ. 3లక్షలు ఉంటుందని ఏసీబీ (ACB ) అడిషినల్‌ ఎస్పీ (Additional SP Ramakrishna) రామకృష్ణ తెలిపారు. మద్యం తరలింపులో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరు తప్పించుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. డ్రైవర్​పై కేసు నమోదు చేసి కోర్టుకు పంపుతున్నట్లు ఆయన వివరించారు. మిగిలిన ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని ఎస్పీ రామకృష్ణ వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.