Police Save The Four Women at Chirala Vadarevu Beach: చీరాల వాడరేవు బీచ్లో కొట్టుకుపోయిన మహిళలు.. కాపాడిన పోలీసులు - Latest News on Chirala
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 22, 2023, 11:01 AM IST
Police Save The Four Women at Chirala Vadarevu Beach : సముద్రంలో అలల తాకిడికి మునిగి పోతున్న నలుగురు మహిళలను పోలీసులు కాపాడారు. ఈ ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. వినాయక నిమజ్జనం సందర్బంగా చీరాల వాడరేవు బీచ్లో మెరైన్ పోలీసులు సీఐ కె.శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎస్ఐ పి.సుబ్బారావు ఆధ్వర్యంలో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కొంత మంది సముద్రంలో వినాయక విగ్రహం నిమజ్జనం (Ganesha Immersion in the Sea at Chirala Vadarevu Beach) చేశారు. అనంతరం సముద్రంలో స్నానం చేస్తుండగా సముద్ర అలల తాకిడికి నలుగురు మహిళలు చేతులు పైకి ఎత్తి కొట్టుకుపోవటం మెరైన్ సిబ్బంది గమనించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని రక్షించి ఒడ్డుకు తీసుకు వచ్చారు. అనంతరం పోలీస్ సిబ్బంది మహిళలకు ప్రథమ చికిత్సస చేసి వారి ప్రాణాలను కాపాడారు. పోలీసులను అక్కడే ఉన్న స్థానికులు అభినందించారు.
TAGGED:
చీరాల బీచ్లో గణేష్ నిమజ్జనం