స్మగ్లర్ల ఎత్తుగడ, కారులో ప్రత్యేక గదులు - భారీగా గంజాయి తరలింపు - కారులో గంజాయిని తరలిస్తున్న నిందితులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 22, 2023, 12:23 PM IST
Police Officers Who Caught Ganjai in Alluri District : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. పోలీసులు ఎన్ని అడ్డుకట్టలు వేసినా ఏదో రూపంలో గంజాయి రవాణా చేసేందుకు అక్రమార్కులు కొత్తదారులు ఎంచుకుంటున్నారు. తాజాగా పాడేరు మండలం సమీపంలో కారులో ప్రత్యేక అరలు ఏర్పాటు చేసుకొని అందులో గంజాయి తరలిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
Police Officers Arrested Five People : పోలీసుల తనిఖీల్లో కారు కింది భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గదుల్ని గుర్తించారు. వాటిలో చాటుగా తరలిస్తున్న గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి లక్ష రూపాయలకు కొనుగోలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గంజాయిని తరలిస్తున్న మరిన్ని ముఠాలను తొందరలోనే పట్టుకుంటామని టాస్క్ ఫోర్స్ ఎస్ఐ వీర్రాజు తెలిపారు. నిందితులను పాడేరు పోలీసు స్టేషన్కు తీసుకువెళ్లి విచారిస్తున్నామని పేర్కొన్నారు.