ధ్రువపత్రాలపై జగన్ ఫొటో- దాఖలైన పిల్ - ఎస్సీ ధ్రువపత్రాలపై పిల్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 9, 2024, 1:56 PM IST
PIL Filed Against Logo Printed On Caste Certificates: కుల ధ్రువపత్రాలపై సీఎం జగన్, నవరత్నాల పథకం లోగోను ముద్రించటం చట్ట విరుద్ధమైన చర్యగా ప్రకటించాలని బహుజన సొసైటీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య కోరారు. ఎస్సీ, ఎస్టీలకు జారీ చేసే కుల, స్థానికత, పుట్టుక తేదీ ధ్రువపత్రాలపై సీఎం జగన్ ఫోటోతో, నవరత్నాల పథకం లోగో ముద్రించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని బాల కోటయ్య దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ, గ్రామ, వార్డు సచివాలయశాఖ, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఏపీలో తప్ప దేశంలోని ఏ రాష్ట్రంలో ప్రభుత్వం జారీచేసే ధ్రువపత్రాలపై ముఖ్యమంత్రి ఫోటో, ప్రభుత్వ పథకాల లోగోలను ముద్రించడం లేదని కోటయ్య మండిపడ్డారు.
ఈ ధ్రువపత్రాలను జీవితకాలం ఆయ వ్యక్తులు వినియోగిస్తారు కాబట్టి వాటిపై రాజకీయ పార్టీకి చెందిన పథకం వివరాలు, ఫోటో ముద్రించకూడదని కోటయ్య తెలిపారు. దీనివల్ల రాజకీయ పార్టీ భావజాలం కలిగిన వ్యక్తుల మనోభావాలను దెబ్బ తీసినట్లు అవుతుందన్నారు. ప్రభుత్వం జారీచేసే ధ్రువపత్రాలపై ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వివరాలకు తావులేకుండా, ధ్రువపత్రాలు స్వతంత్రంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.