CM Jagan Guntur Tour: కారైనా.. హెలికాఫ్టరైనా​.. జగన్​ వస్తే ఆంక్షలు కామనే​ - condolence to MLA Maddali

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 23, 2023, 3:46 PM IST

CM Jagan Tour Problems: సీఎం జగన్​ పర్యటన అంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఆయన రోడ్డు మీద ప్రయాణించినా, గాల్లో ప్రయాణించినా అవే ఆంక్షలు. మొన్నటికి మొన్న విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన కార్యక్రమం నిమిత్తం.. సీఎం జగన్​ హెలికాప్టర్​లో రాగా.. అక్కడికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం-పలాస జాతీయ రహదారిపై ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. ఆ ఘటనపై చాలానే విమర్శలు వచ్చాయి. అది మరువక ముందే తాజాగా గుంటూరు జిల్లాలో కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. 

ముఖ్యమంత్రి జగన్​.. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్​ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు తాడేపల్లి నుంచి గుంటూరు పరేడ్​ మైదానానికి హెలికాఫ్టర్​ ద్వారా చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే గిరిధర్​ ఇంటికి రోడ్డు మార్గాన వచ్చారు. గిరిధర్‌ తల్లి శివపార్వతి ఇటీవల చనిపోయారు. ఆమె చిత్రపటానికి ముఖ్యమంత్రి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం తిరిగి పరేడ్​ మైదానానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాఫ్టర్​ ద్వారా తాడేపల్లికి చేరుకున్నారు. అయితే సీఎం జగన్​ పర్యటన ఎక్కడైనా పోలీసుల ఆంక్షలు కామన్​ అయిపోయాయి. ఆయన రోడ్డు మార్గాన పయనించినా.. హెలికాఫ్టర్​ ద్వారా వచ్చినా సేమ్​ రూల్స్​ అన్నట్లు ఉంది పరిస్థితి. ఆయన తాడేపల్లి నుంచి బయలుదేరిన వెెంటనే మొదలైన ట్రాఫిక్​ ఆంక్షలు.. మద్దాలి కుటుంబసభ్యులను పరామర్శించి తిరిగి తాడేపల్లికి చేరే వరకూ ఆ ఆంక్షలు కొనసాగాయి. ఈ ఆంక్షల వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. జడ్పీ కార్యాలయానికి వెళ్లే రెండు మార్గాలను మూసివేశారు. కార్యాలయానికి వెళ్లేందుకు ఉద్యోగులు, అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.