People Problems for Cremation Due to No Bridge: వాగు దాటలేక.. దహన సంస్కారాలకు ప్రజల అవస్థలు - రావిపాడు లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
People Problems for Cremation Due to No Bridge: ఆ గ్రామంలో దహన సంస్కరాలు చేయాలంటే పొంగిపొర్లుతున్న వాగు సైతాన్ని దాటిపోవాల్సిందే. ఒకవేళ గుండ్లకమ్మ ఉద్ధృతంగా ప్రవహించిందంటే ఆ ఊరిలో దహన సంస్కరాలు జరిగే ఆస్కారమే లేదు. ఈ దుస్థితి అధికార వైసీపీ సర్పంచ్‌కే రావటంతో ఆ గ్రామ ప్రజలను కలచివేసింది. ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా గుండ్లకమ్మ వాగుపై బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. ఈ పరిస్థితి ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా.. తన చేతిలో నిధులు లేకపోవడంతో సొంత పార్టీ నేతలకే.. ఎమ్మెల్యే ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. సమస్యను అధికారుల దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లినా పరిష్కారం కాకపోవటంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలోని మేజర్ పంచాయతీకి ఈ దుస్థితి పట్టటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.