బాలినేని శ్రీనివాసరెడ్డిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి: పీతల మూర్తి యాదవ్ - జనసేన నేత పీతల మూర్తి యాదవ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 12, 2023, 10:28 PM IST
Peethala Murthy Yadav allegations against Balineni Srinivasa Reddy: అవినీతి చేసినట్లు ఒప్పుకున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని, తక్షణమే బర్తరఫ్ చేసి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని విశాఖ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. బాలినేని అక్రమ సంపాదనలో తాడేపల్లి ప్యాలెస్ వాటా ఎంత అని ప్రశ్నించారు. బాపట్ల జిల్లా బల్లికురవలో 500 ఎకరాల బ్లాక్ గ్రానైట్ కొండను బాలినేని బినామీలకు సీఎం జగన్ అప్పగించటం అవినీతిని ప్రోత్సహించటమే అని విమర్శించారు. బాలినేని, ఆయన బినామీలపై ఈడీ విచారణ జరపాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు.
బాలినేని శ్రీనివాస రెడ్డి మంత్రిగా లంచాలు తీసుకున్నట్టు అంగీకరించాడని, అతడిని తక్షణమే బర్తరఫ్ చేసి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. విశాఖలోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రిగా బాలినేని, ఆయన వియ్యంకుడు భాస్కర్ రెడ్డి పేరిట వేలాది ఎకరాల భూములు సంపాదించారని ఆరోపించారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన అవినీతిలో సీఎం జగన్ పాత్ర ఉందని ఆరోపించారు. బాపట్ల జిల్లా బల్లికురవలోని కోట్ల రూపాయల విలువ చేసే 500 ఎకరాల బ్లాక్ గ్రానైట్ కొండను బాలినేని బినామీలకు ముఖ్యమంత్రి అప్పగించటం అవినీతిని ప్రోత్సహించటమే అని విమర్శించారు. బల్లికురవ కొండలను బాలినేని తన కబంధ హస్తాల్లో పెట్టుకున్నారని ఆరోపించారు. సీబీఐ, ఈడీల ద్వారా బాలినేని ఆయన బినామీల లావాదేవిలపై సమగ్ర విచారణ జరిపించాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు.