ప్రొద్దుటూరులో పాయల్ రాజ్‌పుత్, రష్మి గౌతమ్ సందడి - పోటెత్తిన అభిమానులు - ప్రొద్దుటూరులో పాయల్ రాజ్‌పుత్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 8, 2023, 9:25 PM IST
Payal Rajput and Rashmi Gautam in Kadapa Proddatur: ప్రొద్దుటూరులోని మైదుకూరు రోడ్డు ఈ రోజు జనంతో కిక్కిరిసిపోయింది. అరుపులు, విజల్స్తో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. ఇంతకీ ఏం జరిగింది అనేదేగా మీ సందేహం. తమ అభిమాన నటులను చూసేందుకు యువత పెద్ద ఎత్తున చేరుకున్నారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో సినీ నటి పాయల్ రాజ్‌పుత్, యాంకర్ రష్మి గౌతమ్ సందడి చేయడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారిపోయింది.
మైదుకూరు రోడ్డులోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. పాయల్, రష్మిలను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేదికపై నుంచి అభిమానులను పలకరించడంతో యువకులు కేరింతలు కొట్టారు. సినీ తారలతో సెల్ఫీ దిగేందుకు అభిమానులంతా పోటీ పడ్డారు. ప్రొద్దుటూరుకు రావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని పాయల్ రాజ్‌పుత్, రష్మీ గౌతమ్ తెలిపారు.
కాగా పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్లో తెరకెక్కిన 'మంగళవారం' మూవీ పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లలో విడుదలైంది. హారర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.