Pawan Kalyan on Volunteers వాలంటరీ వ్యవస్థపై పూర్తి అధ్యయనం చేశాకే మాట్లాడా..!: పవన్ కళ్యాణ్ - janasena chief pawan comments
🎬 Watch Now: Feature Video
Janasena Chief Pawan Comments on Volunteers: రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాకి కారణం వాలంటీర్ వ్యవస్థే అని జులై 9వ తేదీన వారాహి రెండో దశ యాత్రలో భాగంగా ఏలూరులో నిర్వహించిన బహిరంగ సమావేశంలో జనసేన అధినేత కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి వ్యాఖ్యానించారు. వాలంటరీ వ్యవస్థపై చాలా అధ్యయనం చేసిన తర్వాతే మాట్లాడానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ నాయకులతో పవన్ సమీక్ష నిర్వహించారు. ఈసారి ఎన్నికల్లో తెనాలిలో పార్టీ జెండా ఎగరాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. నాదెండ్ల మనోహర్ గెలుపు పార్టీకి ఎంతో కీలకమన్నారు. 'ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు.. నేను బాగుండాలి.. నేనే బాగుపడిపోవాలి' అనేది వైసీపీ నాయకులకు పుట్టుకతో వచ్చిన బుద్ధి అని విమర్శించారు. దాన్ని తానెప్పుడో గ్రహించాను కాబట్టే మొదటి నుంచీ ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నానన్నారు. ప్రజలు మాత్రం ఎంతో సానుభూతితో తండ్రి లేని పిల్లాడు.. సంవత్సరం నుంచి నడుస్తున్నాడని జాలితో ఓట్లు వేశారని.. దానికి ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపపడుతున్నారని చెప్పారు. వాలంటరీ వ్యవస్థపై న్యాయస్థానంలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.