Passenger Drank Liquor in APSRTC Bus ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ.. మద్యం సేవించొచ్చు..! వీడియో వైరల్.. - ఒంగోలు టు చీరాల బస్సులో మద్యం సేవించిన వీడియో
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 16, 2023, 8:09 PM IST
Passenger Drank Liquor in APSRTC Bus ఆర్టీసీ బస్సులో దర్జాగా డ్రైవర్ ప్రక్కన బ్యానెట్ పై కూర్చుని ఓ వ్యక్తి మద్యం సేవించిన ఘటన బాపట్లజిల్లా వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి చోటుచేసుకున్నట్లుగా భావిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని చీరాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం రాత్రి ఒంగోలు నుంచి చీరాల వస్తున్న సమయంలో త్రోవగుంట వద్ద ఓ ప్రయాణికుడు బస్సు ఎక్కాడు. బస్సులో ప్రయాణికులు కిక్కిరిసి ఉండడటంతో.. ఆ వ్యక్తి డ్రైవర్ ప్రక్కన బ్యానెట్‌పై కూర్చున్నాడు. పోనీలే కూర్చున్నాడు లే.. అని డ్రైవర్ అనుకునే లోపే.. చేతిలో ఉన్న మద్యం సీసా తీసుకుని తన పని కానిచ్చుకున్నాడా మందుబాబు. ఇదంతా బస్సులో ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్తా.. వైరల్‌గా మారింది. ఆ ప్రయాణికుడు మందు తాగుతుండగా వారించానని డ్రైవర్ చెబుతుండగా.. ఈ ఘటనపై పూర్తిగా విచారించి తగిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.