టీటీడీని సందర్శించిన భారత పురావస్తు శాఖ అధికారులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 18, 2024, 6:05 PM IST
Officials of Archaeological Department of India Visit TTD : అలిపిరి పాదాలమండపం వద్ద శిథిలావస్ధకు చేరుకున్న భక్తుల విశ్రాంతి మండపాన్ని భారత పురావస్తుశాఖ అధికారులు పరిశీలించారు. పురావస్తు శాఖ అనుమతి లేకుండా రాతి మండపం పునర్నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. శిథిలమైన భక్తుల వసతి మండపాన్ని పరిశీలించాలని టీటీడీ భారత పురావస్తు శాఖను కోరగా ఈ రోజు సంబంధిత శాఖకు చెందిన ముగ్గురు సభ్యుల బృందం అలిపిరి మండపాన్ని పరిశీలించింది.
అలిపిరితో పాటు టీటీడీ పరిధిలో శిథిలావస్ధకు చేరుకున్న పురాతన మండపాలను పరిశీలించి నివేదిక ఇవ్వనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. పురావస్తు శాఖ నివేదిక మేరకు మండపాల పునర్నిర్మాణం పై చర్యలు తీసుకుంటామని టీటీడీ సీఈ నాగేశ్వరరావు తెలిపారు. అతి పురాతనమైన ఈ మండపాలు, మరికొన్ని కట్టడాలు కూలిపోయే దశలో ఉన్నాయని పరిశీలించిన అధికారులు తెలిపారని ఆలయ సీఈ స్పష్టం చేశారు.