Nuzvid IIIT Students Agitation: నూజీవీడు ట్రిపుల్ ఐటీలో నాణ్యత లేని ఆహారం.. ఆందోళనకు దిగిన విద్యార్థులు - Nuzvid IIIT Students Protest
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 7, 2023, 7:47 PM IST
Nuzvid IIIT Students Agitation For Good Food : ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. తమ సమస్యులు పరిష్కారించాంటూ.. నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. మెస్ నిర్వహణ అధ్వానంగా (Worst Mess Management in Nuzvid Triple IT) ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్ల చారు, పులిసిపోయిన పెరుగు, చిమిడి పోయిన అన్నం పెడుతున్నారంటూ డైనింగ్ హాల్ ఎదుట విద్యార్థులు బైటాయించారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అక్కడి ప్రాంగణాన్ని హోరెత్తించారు. విషయం తెలుసుకున్న డైరెక్టర్ నిరసన ప్రాంగణానికి చేరుకున్నారు. డైరెక్టర్ విద్యార్థులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది.
మూడు గంటలకు పైగా విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. ట్రిపుల్ ఐటీలోకి పోలీసులు భారీగా చేరుకొని, ఆందోళనకారులను శాంతింప చేశారు. మూడు గంటల విద్యార్థుల ఆందోళన అనంతరం డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మంచి భోజనం కోసం ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీలో విద్యార్థులను కూడా సభ్యులుగా చేరుస్తామని, నిత్యం భోజన నాణ్యత పై పరిశీలన కొనసాగించి ముందుకు సాగనున్నట్లు స్పష్టం చేశారు. మెస్‌లో నెలకొన్న సమస్యలను రానున్న వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
సబ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్ర మెస్ వద్దకు చేరుకొని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ట్రిపుల్ ఐటీలో ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు విద్యార్థులతో ప్రత్యేకమైన సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థుల నుండి తెలుసుకున్న సమస్యలను పరిష్కరించేందుకు కళాశాల నిర్వాహకులతో చర్చలు కొనసాగించారు. అతి త్వరలో సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించనున్నట్లు విద్యార్థులకు తెలిపారు.
TAGGED:
Nuzvid Triple IT