'రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన కృషి' - ₹1.30కోట్ల విరాళం అందించిన ప్రవాసాంధ్రులు - NRI Leaders meet pavan kalyan
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 20, 2023, 12:36 PM IST
NRI Leaders Gives Fund to Janasena Party: జనసేన పార్టీ ఎదుగుదల కోసం ప్రవాస భారతీయులు, ప్రవాసాంధ్రులు అందిస్తున్న సహకారం ఎన్నటికీ మరువలేనిదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Janasena Party Leader pavan Kalyan) అన్నారు. పార్టీ ఆశయాలను కాపాడుకుంటూ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసే ప్రయాణంలో ఎన్నారై (NRI)లు తమ వంతు సహకారం అందించారని పవన్ కల్యాణ్ తెలిపారు.
NRI Leaders Donated Rs.1Crore 30 lakhs to Janasena Party Fund: గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆస్ట్రేలియా కన్వీనర్ కొలికొండ శశిధర్ ఆధ్వర్యంలో యూకే (UK), ఐర్లాండ్ (Ireland), ఆస్ట్రేలియా (Australia), జర్మనీ (Germany), నెదర్లాండ్ (Netherland)కు చెందిన జనసేన నేతలు పవన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎన్నారై నేతలు జనసేన పార్టీ సహాయ నిధికి కోసం రూ.కోటీ 30లక్షలు విరాళంగా అందించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్న జనసేన పార్టీకి ఎల్లవేళలా అండగా ఉంటామని ఎన్నారై నేతలు తెలిపారు.
TAGGED:
పవన్‌ను కలిసిన ఎన్నారై నేతలు