No Response to Jagananna Arogya Suraksha: 'జనాలెక్కడ జగనన్నా'..! 'జగనన్న సురక్ష'కు స్పందన కరవు.. ఉపన్యాసాలతో విసిగిస్తున్న నేతలు - ఆత్మకూరు లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 26, 2023, 5:38 PM IST
No Response to Jagananna Arogya Suraksha: వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమానికి స్పందన కరవైంది. జనాలు లేకుండా ఖాళీ కుర్చీలతో సభ వెలవెలబోయింది. దీంతో అధికారులు, మున్సిపల్ సిబ్బంది తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో జరిగింది. ఈ రోజు ఆత్మకూరులోని 17, 19, 20 వార్డులలో.. 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల సమయంలో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి 11 గంటల వరకు జనాలు రాలేదు.
దీంతో జనాల కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు మెడికల్ క్యాంపు వద్ద ఎదురుచూడాల్సి వచ్చింది. కార్యక్రమంలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీలలో అధికారులు, మున్సిపల్ సిబ్బంది తప్ప జనాలు కరువయ్యారు. ఎట్టకేలకు వాలంటీర్ల ద్వారా 11.30 గంటల సమయంలో కొంతమంది జనాలను తరలించారు. అయితే 'జగనన్న ఆరోగ్య సురక్ష' పేరుతో జనాలను కూర్చోబెట్టి గంటలసేపు రాజకీయాలు మాట్లాడుతుండటంతో ఎవరూ రావడంలేదని పలువురు అంటున్నారు.