thumbnail

నీట మునిగిన పంట - గుండెపోటుతో రైతు మృతి - జగన్​ హయాంలో అన్నదాతకు భరోసా లేదన్న నిమ్మల

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 12, 2023, 4:07 PM IST

Nimmala Consulted Family of Farmer Died with Heart Attack: ఆరుగాలం కష్టపడి పండించిన పంట  చేతికందే సమయానికి తుపాను ప్రభావంతో నీటి పాలవడాన్ని చూసి తట్టుకోలేక గుండెపోటుతో ఓ రైతు మరణించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం వడ్లవానిపాలెంలో కోత కోయడానికి సిద్దమైన చేను ఆకుమడిలా మెులకలు రావడం చూసి చేనుగట్టునే గుండెపోటుతో కౌలురైతు ప్రభాకర్‌రావు కుప్పకూలారు. ఈరోజు వడ్లవానిపాలెంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పర్యటించి, ప్రభాకర్‌రావు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వల్లే ఇటువంటి ఘటనలు తలెత్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం బాధ్యత వహించి బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించాలని నిమ్మల కోరారు.

Farmer Died with Heart Attack Due to Loss of Crop: కౌలు రైతు ప్రభాకర్‌రావు శవపేటికను నిమ్మల మోశారు. ప్రభాకర్‌రావు మట్టి ఖర్చులకు రూ.30వేలు తక్షణ సాయం అందించారు. జగన్ హయాంలో అన్నదాతకు భరోసా లేదని మండిపడ్డారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.5లక్షలు సాయం అందించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.