Nellore Police Seized 75 Kgs Ganja: నెల్లూరు జాతీయ రహదారిపై కారు బోల్తా.. 75 కేజీల గంజాయి పట్టివేత - నెల్లూరు జిల్లా 75 కేజీల గంజాయి కేసు న్యూస్
🎬 Watch Now: Feature Video
Nellore Police Seized 75 Kgs Ganja: నెల్లూరు జాతీయ రహదారిపై 75 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుంచి వస్తున్న ఓ కారు నెల్లూరు వద్ద జాతీయ రహదారిపై బోల్తా పడింది. డ్రైవర్ వేగంగా నడుపుతూ సడన్ బ్రేక్ వేయటం వల్ల కారు పల్టీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయలు అయ్యాయి. కారు వెనక భాగంలో ఉన్న 75 కేజీల గంజాయి బయట పడింది. పోలీసులు రాకతో ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడ నుంచి స్వల్ప గాయాలతో పరారయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న 75 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ ఘటనలో కారు ముందు భాగం తుక్కుతుక్కైంది. పరారైన ముగ్గురు నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. పట్టుపడిన 75 కేజీల గంజాయి విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.