రాజ్యాధికారం లక్ష్యంగా డిసెంబర్ 7 నుండి రాష్ట్రవ్యాప్తంగా రథయాత్ర - బీసీల సంక్షేమం కోసం మరో స్వాతంత్ర పోరాటం: బీసీ సంఘాల నేతలు - Vizag News

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2023, 8:07 PM IST

National BC Welfare Association Meeting in Visakhapatnam: దేశంలో ఏ పార్టీ కూడా బీసీల సంక్షేమం గురించి పట్టించుకోవడంలేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సందర్భంగా బీసీలను వాడుకొని అనంతరం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. అందుకే 2024 ఎన్నికల్లో ఏ పార్టీ అయితే బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తుందో వారికే మద్దతిస్తామని బీసీ సంఘాల నాయకులు అన్నారు. రాష్ట్రంలోని బీసీలను ఐక్యం చేసేందుకు రథయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. విశాఖలో జరిగిన జాతీయ బీసీ సంఘ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీసీల సంక్షేమం కోసం మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధమవుతున్నామని.. ఇందులో భాగంగా బీసీల రాజ్యాధికారం కోసం డిసెంబర్ 7వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా రథయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీలకు శాసనసభలో 90 శాతం సీట్లు, పార్లమెంట్లో 12 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కూడా తమ డిమాండ్​లు అమలు చేయకపోతే జరగబోయే ఎన్నికలో ఖచ్చితంగా బీసీల సత్తా చాటుతామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.