బడ్జెట్ సమావేశంలో రసాభాస - అంకెల గారడీతో వైసీపీ కౌన్సిలర్ల మాయ - AP Latest News
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-01-2024/640-480-20449094-thumbnail-16x9-municipal-budget-meeting.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 7, 2024, 10:41 AM IST
Narsipatnam Municipal Budget Meeting Turned Into Controversy: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పురపాలక సంఘ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో ఆదాయం, ఖర్చులకు సంబంధించి పొంతన లేకుండా అంకెల గారడీతో సమావేశంలో ప్రవేశ పెట్టిన తీరు విడ్డూరంగా ఉందని టీడీపీ, జనసేన కౌన్సిలర్‌లు చింతకాయల పద్మావతి, అద్దేపల్లి సౌజన్యలు అభ్యంతరం వ్యక్తం చేశారు. నర్సీపట్నం పురపాలక కౌన్సిల్ బడ్జెట్ సమావేశం ఛైర్మన్ సుబ్బలక్ష్మి అద్యక్షతన జరిగింది. చర్చకు వచ్చిన అనేక అంశాలపై అధికార పార్టీ కౌన్సిలర్‌లు సమాధానం చెప్పకపోవడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ వైసీపీ నాయకులు గ్రామాన్ని అభివృద్ధి చేశాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ టీడీపీ ప్రభుత్వంలో 80 శాతం పూర్తయిన టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ప్రజలకు ఇవ్వలేక పోయారు. వాటికి కనీసం 20 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారు ఇంకేంటి వీళ్లు అభివృద్ధి చేసింది అని విమర్శించారు.