TTD: నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవ వేడుక.. ఘనంగా నిర్వహించిన టీటీడీ - తిరుమల సమాచారం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 31, 2023, 11:15 AM IST

Narayangiri Chatrasthapanostvam in Tirumala: తిరుమలలో నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద ఛత్రస్థాపనోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును శ్రీవారి పాదాల వద్ద అర్చక బృందం ప్రతిష్ఠించింది. ఈ వేడుకకు ముందు ఆలయం నుంచి పూజా సామ‌గ్రి, పుష్పాలు, నైవేద్యం, గొడుగుతో మంగళవాయిద్యాల నడుమ ఆల‌య మాడ వీధుల గుండా అర్చక బృందం మేదరమిట్టకు చేరుకున్నారు. అక్కడి నుంచి నారాయ‌ణ‌గిరికి విచ్చేశారు. శ్రీ‌వారి పాదాల‌కు తిరుమంజ‌నం చేప‌ట్టారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనంతో విశేషంగా స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం అలంకారం, పూజ కార్యక్రమాలు నిర్వహించి.. నైవేద్యం సమర్పించారు. ఆ త‌రువాత‌ భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీ వేంకటేశ్వర స్వామి మొదట కాలు మోపినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి కాబట్టి.. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో మరింత ఎక్కువగా గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్ఠిస్తారని భక్తులు అంటున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.