యువగళం పాదయాత్ర ముగింపు సభ - హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ - నారా లోకేశ్ యువగళం పాదయాత్ర
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 3, 2023, 9:39 AM IST
Nara Lokesh Yuvagalam Padayatra Closing Meeting: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర.. ఈ నెల 17 తేదీన భీమిలి నియోజకవర్గంలో ముగుస్తుందని టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. సభకు టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు పవన్‌కల్యాణ్ హాజరై ప్రసంగిచనున్నట్లు శ్రీనివాస్ వెల్లడించారు.
నాలుగున్నర సంవత్సరాలుగా సీఎం జగన్ మనస్తత్వం ప్రజలు చూస్తున్నారని, రాష్ట్ర ప్రజలు సైకిల్ రావాలి సైకో పోవాలని నినదిస్తున్నారని శ్రీనివాసరావు అన్నారు. జగన్ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ నేరస్తులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. లోకేశ్ యువగళం పాదయాత్ర ఈ నెల 6 తేదీకి అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చేరుకుంటుందని వివరించారు. పాయకరావుపేట నుంచి ఈ నెల 7వ తేదీన యువగళం పాదయాత్ర ప్రారంభమై, ఈనెల 17వ తేదీన భీమిలి నియోజకవర్గంలో ముగుస్తుందని చెప్పారు. యువగళం ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.