Nara Lokesh Went to Delhi: దిల్లీ బయల్దేరిన నారా లోకేశ్.. చంద్రబాబు కేసులపై న్యాయ నిపుణులతో చర్చలు - సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-11-2023/640-480-19911281-thumbnail-16x9-nara-lokesh-went-to-delhi.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 1, 2023, 11:27 AM IST
Nara Lokesh Went to Delhi : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అమరావతి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో (Chandrababu Naidu Quash Petition Pending in Supreme Court ) ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు చంద్రబాబుపై (Chandrababu Cases) ఏపీ ప్రభుత్వం వరుస కేసులు నమోదు చేస్తోంది. ఈ తరుణంలో దిల్లీ వెళ్లిన నారా లోకేశ్.. అక్కడ న్యాయ నిపుణులతో చర్చించనున్నారు. చంద్రబాబుపై నమోదవుతున్న కేసుల విషయంలో న్యాయపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై న్యాయ నిపుణులతో లోకేశ్ చర్చించనున్నారు.
AP High Court Imposed Conditions for Chandrababu :చంద్రబాబు బెయిల్ షరతులపై నేడు హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. బెయిల్ ఉత్తర్వుల్లో మరికొన్ని షరతులు విధించాలని సీఐడీ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని మంగళవారం చంద్రబాబు తరఫు లాయర్లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు (High Court Conditions for Chandrababu) చేసిన హైకోర్టు.. సీఐడీ పిటిషన్ పరిష్కరించేవరకు రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని ఆదేశించింది. కేసుకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించవద్దని ఆదేశాల్లో పేర్కొంది.