జగనాసుర కుట్రలో భాగంగానే చంద్రబాబును ఏ3గా చేర్చారు: నారా లోకేశ్
🎬 Watch Now: Feature Video
Nara Lokesh Tweet on Chandrababu Liquor Case: తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి తప్పుడు మద్యం కేసు పెట్టారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ప్రివిలైజ్ ఫీజు రద్దు ఫైల్ చంద్రబాబు వద్దకు రాలేదని లోకేశ్ తెలిపారు. ఆ శాఖ కూడ చూడలేదు, సంతకం చేయలేదని స్పష్టం చేశారు. అయినా చంద్రబాబుని ఏ3గా తప్పుడు కేసు నమోదు చేయటం జగనాసుర కుట్రలో భాగమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస కేసులతో చంద్రబాబుని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా చేసుకున్నారని దుయ్యబట్టారు.
మద్యం కేసులో ప్రభుత్వం చేసేవన్నీ తప్పుడు ఆరోపణలే అని ధ్వజమెత్తారు. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారంగా చూపిస్తూ.. నారా లోకేశ్ ట్విట్టర్లో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇప్పటికే స్కిల్ కేసులో చంద్రబాబు సాధారణ బెయిల్ మంజూరు కాగా.. మద్యం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్, చంద్రబాబు తరఫున నాగముత్తు, దమ్మాలపాటి శ్రీనివాస్ గురువారం వాదనలు వినిపించారు.