మేరీమాత ఉత్సవాల్లో పాల్గొన్న నారా లోకేశ్ - నారా లోకేశ్ కామెంట్స్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 13, 2024, 10:10 PM IST
Nara Lokesh: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి ఆర్సీఎం అధ్వర్యంలో మేరీమాత ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్నారు. మేరీ మాత ఉత్సవాలను లోకేశ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. లోకేశ్‌కు చర్చి ఫాదర్ ఆశీర్వచనం అందించారు.
అనంతరం నారా లోకేశ్ ఉండవల్లిలోని ప్రముఖ బీసీ నేత వల్లభాపురం నాగేశ్వరరావు ఇంటికి వెళ్లారు. రజక కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను నాగేశ్వరరావు లోకేశ్ దృష్టికి తెచ్చారు. తాను చేపట్టిన యువగళం పాదయాత్రలో రాష్ట్రవ్యాప్తంగా రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా అధ్యయనం చేశానని లోకేశ్ చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వలో రజకులతోపాటు ఇతర చేతివృత్తుల వారికోసం ఆదరణ పథకం ద్వారా 90శాతం సబ్సిడీతో పనిముట్లుఇచ్చిన విషయాన్ని లోకేశ్ గుర్తుచేశారు. రూ. 964 కోట్లతో అప్పుడే చేతివృత్తుల కోసం పనిముట్లు కొనుగోలు చేశామని వెల్లడించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో వాటిని ఇప్పటి వరకు జగన్ లబ్ధిదారులకు అందించక పోవడంతో అవి పాడైపోయే స్థితికి చేరుకున్నాయని తెలిపారు. రాబోయే ప్రజాప్రభుత్వం రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తుందని లోకేశ్ హామీ ఇచ్చారు. రజక వృత్తిపనిపై ఆధారపడిన వారి కోసం అత్యాధునిక దోబీఘాట్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.