Nara Lokesh Criticizes CM Jagan Government: చంద్రబాబు అరెస్టు కక్ష సాధింపే.. బెయిల్ రావొద్దని మరో 3 కేసులు రెడీ చేశారు : లోకేశ్ - టీడీపీ ఆన్ లోకేశ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 2, 2023, 7:12 PM IST
Nara Lokesh Criticizes CM Jagan Government: ఏ తప్పూ చేయని చంద్రబాబును అరెస్టు చేయడం కక్ష సాధింపు తప్ప మరొకటి కాదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనులు ప్రజల ముందుంచుతామని స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా దిల్లీలో చేపట్టిన దీక్ష విరమణ తర్వాత ఆయన మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదలు... తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును, తమ నేతలను జైలుకు పంపాలని కుయుక్తులు పన్నారని లోకేశ్ విమర్శలు గుప్పించారు.
రాజకీయ కక్షసాధింపుతోనే చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి 24 రోజులుగా జైలులో ఉంచారని లోకేశ్ ఆరోపించారు. స్కిల్ కేంద్రాల్లో శిక్షణ పొందిన 80 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన నేతను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు నిర్ణయం మేరకు మా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని లోకేశ్ తెలిపారు. చంద్రబాబుకు బెయిల్ వస్తుందనే.. మరో 3 కేసులు సిద్ధం చేశారని ఆరోపించారు. తనకు సంబంధం లేని విషయాల్లో తనపై కేసులు పెట్టారని ఆరోపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు.. అయినా తనకు నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై జోక్యం చేసుకోవాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరినట్లు లోకేశ్ వెల్లడించారు. చంద్రబాబుకు మద్దతుగా... మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్న వారిపై కేసులు దారుణమని లోకేశ్ పేర్కొన్నారు.