Nara Lokesh Padayatra: 'బాహుబలి'లో కుంతల రాజ్యం.. జగనన్న పాలనలో గుంతల రాజ్యం: నారా లోకేశ్ - Nara Lokesh 166th day Yuvagalam
🎬 Watch Now: Feature Video
Nara Lokesh Yuvagalam Padayatra in Ongole : ప్రజలందరూ బాహుబలి సినిమాలో కుంతల రాజ్యాన్ని చూస్తే.. జగనన్న పాలనలో గుంతల రాజ్యాన్ని చూస్తున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో 3 లక్షల ఇళ్లు పూర్తి చేశామని.. అదే 3 లక్షల ఇళ్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి కట్టాలంటే వంద జన్మలు ఎత్తాలని అన్నారు. జగన్‌కు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయడం తెలియదని ఒంగోలులో నిర్వహించిన బహిరంగ సభలో ఆక్షేపించారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే రాష్రం మూడో స్థానంలో ఉందని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే రెండో స్థానంలో ఉందని గుర్తు చేశారు. విధులు, నిధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర 650 రూపాయలు ఉంటే.. ప్రస్తుతం 1350 రూపాయలకు పెంచారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం రాగానే యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
జగన్ అద్భుతమైన కటింగ్, ఫిటింగ్ మాస్టర్ అని ఎద్దేవా చేశారు. జగన్ దగ్గర రెండు బటన్లు ఉన్నాయని, బల్లపైన బ్లూ బటన్, బల్లకింద రెడ్ బటన్లు ఉన్నాయన్నారు. దేశంలో 100 సంక్షేమ పథకాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్తి జగన్ అని అన్నారు. మహిళలకు జగన్ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని, మహిళల కన్నీరు తుడిచే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం యువగళం పాదయాత్ర 166వ రోజు ప్రకాశం జిల్లాలో సాగింది.