Nara Family Special Poojas for CBN in Naravaripalli : చంద్రబాబు కోసం స్వగ్రామంలో ప్రత్యేక పూజలు - చంద్రబాబు నాయుడు తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 15, 2023, 11:58 AM IST
Nara Family Special Poojas for CBN in Naravaripalli : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కోసం నారా కుటుంబ సభ్యులు తిరుపతి జిల్లాలోని స్వగ్రామంలోని కుల దైవానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు సోదరి రాజేశ్వరి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజలు జరిపించారు. వారితోపాటు చంద్రగిరి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పులివర్తి నాని సతీమణి సుధా రెడ్డి కూడా పాల్గొని పూజలు అభిషేకాలు నిర్వహించారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జైలు నుంచి త్వరగా విడుదల కావాలని స్వగ్రామైన చంద్రగిరి మండలంలోని నారావారిపల్లెలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబునాయుడు సోదరి రాజేశ్వరి వారి కుల దైవం నాగాలమ్మ తల్లికి పొంగళ్లు పెట్టి, పూజలు చేసి, అభిషేకాలు జరిపించారు. చంద్రబాబునాయుడు మచ్చలేని నాయకుడిగా, త్వరగా జైలు నుంచి బయటకు రావాలని అభిషేకాలు నిర్వహించారు. అలానే తీర్పునిచ్చే కోర్టులకు కచ్చితమైన నిజాలను తెలియజేసేలా చేయాలని నాగలమ్మను వేడుకున్నారు.