Nara Bhuvaneshwari Visited Rajamahendravaram Temples: చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యం, విడుదలపై నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు - Nara Bhuvaneshwari news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 20, 2023, 5:54 PM IST
Nara Bhuvaneshwari Visited Rajamahendravaram Temples: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైలులో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, త్వరగా జైలు నుంచి విడుదల కావాలని.. ఆయన సతీమణి నారా భువనేశ్వరి రాజమహేంద్రవరంలోని స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి గట్టున ప్రసిద్ధిగాంచిన ఉమా మార్కండేయ స్వామి ఆలయంలోని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు. అనంతరం దేవీచౌక్‌లో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో పాల్గొని.. బాలాత్రిపుర సుందరి దేవికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు.
TDP Leaders Chandi Yagam: మరోవైపు రాజమహేంద్రవరం శ్రీరామ్ నగర్‌లో వెలిసిన సంకటహర వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో చంద్రబాబు నాయుడు త్వరగా కేసుల నుంచి బయటపడాలని.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ చండీ హోమం, రాజా శ్యామల యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ఆదిరెడ్డి వాసు పాల్గొని.. అమ్మవారి ఆశీస్సులు పొందారు.