Nakka Anand Babu on Minister Peddireddy: ఇసుక దోపిడీపై మంత్రి పెద్దిరెడ్డి మసిపూసి మారేడుకాయ చేశారు: నక్కా ఆనంద్ - మంత్రి పెద్దిరెడ్డిపై నక్కా ఆనంద్ బాబు ఫైర్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2023, 9:15 PM IST

Nakka Anand Babu on Minister Peddireddy: జగన్ రెడ్డి ఇసుక దోపిడీపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Minister Peddireddy Ramachandra Reddy) వాస్తవాలు దాచి కబుర్లు చెప్పారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు (Nakka Anand Babu) మండిపడ్డారు. ఇసుక దోపిడీపై ప్రభుత్వ బోగస్ వ్యవహారాలు కప్పిపుచ్చడానికి.. మంత్రి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. చంద్రబాబు లేవనెత్తిన ప్రశ్నలకు 6 రోజుల తర్వాత కూడా సమాధానం చెప్పలేకపోయారని దుయ్యబట్టారు. జేపీ వెంచర్స్ (JP Ventures) సంస్థ కాలపరిమితి పొడిగిస్తే, దానికి సంబంధించిన జీవోను పెద్దిరెడ్డి ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. తవ్వకాలకు సంబంధించిన పర్యావరణ క్లియరెన్సులు ఎందుకు బయట పెట్టడం లేదని నిలదీశారు. 

ఇసుక రీచ్​లలో ఇష్టానుసారం యంత్రాలతో తవ్వకాలు జరపడానికి ఎలాంటి అనుమతులున్నాయో బయటపెట్టాలని సవాల్‌ విసిరారు. నాలుగేళ్లలో ప్రభుత్వానికి ఇసుకపై ఎంత ఆదాయం వచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు విధించిన స్టే తీసేయలేదని గుర్తు చేశారు. ఇసుక దోపిడీపై ఏదో ఒకరోజు న్యాయస్థానానికి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) సమాధానం చెప్పక తప్పదని హెచ్చరించారు. జగన్ రెడ్డి, అతని గ్యాంగ్ విచ్చలవిడిగా సాగిస్తున్న ఇసుక దోపిడీపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్‌ విసిరారు. పెద్దిరెడ్డి వచ్చినా, అధికారులు వచ్చినా ప్రజల ముందు దోషులుగా నిలబెడతామన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.