సీఎం జగన్ స్టే తెచ్చుకోకుండా సీబీఐ విచారణ ఎదుర్కోగలడా? : రఘురామ - వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు లైవ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2023, 4:51 PM IST

MP Raghurama Krishnam Raju allegations against CM Jagan: రాష్ట్రంలో ఆర్థిక అవకతవకలపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. వైసీపీ ప్రభుత్వ అవినీతి, పాలసీలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్ వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రఘురామ తరఫున సీనియర్ న్యాయవాది మురళీధర్ రావు పిటిషన్‌ వేశారు. ఈ కేసు విచారణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందనరావుతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. దీనిపై నాట్ బిఫోర్‌ మీ అంటూ... విచారణ నుంచి జస్టిస్ రఘునందన్ రావు తప్పుకున్నారని... మరో ధర్మాసనం ముందు విచారణకు పంపాలని రిజిస్ట్రీ కి ఆదేశాలిచ్చినట్లు రఘురామ తెలిపారు. ఏ బెంచ్ విచారించాలో సీజే (CJ) నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో... కోర్టుల్లో స్టే తెచ్చుకోకుండా సీఎం జగన్ (CM Jagan) సచ్చీలుడుగా సీబీఐ విచారణను ఎదుర్కోగలడా అని ఎద్దేవా చేశారు.

టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం రుణం: సీఎం జగన్.. ఏపీలోని అందరి ఆస్తులను, బ్యాంకుల్లో తాకట్టు పెట్టే అవకాశం ఉందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. పాలకొల్లులో టిడ్కో ఇళ్లు (Tidco Houses) ఇచ్చి.. వాటిపై ప్రభుత్వం రుణం తీసుకుందని పేర్కొన్నారు. ఇళ్లపై తీసుకున్న రుణాన్ని నిమ్మల రామానాయుడు బయటపెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆర్థిక కుంభకోణాలపై కోర్టులో పిటిషన్ వేసిన పోరాడుతున్నాని తెలిపారు. ఈ కేసు వేరే ధర్మాసనం ముందు త్వరలో విచారణకు రానుందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను (Volunteers) అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని రఘురామ ఆరోపించారు.

జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు: జగన్ అక్రమాస్తులపై త్వరగా విచారణ జరపాలన్న జోగయ్య పిటిషన్​ వేసిన నేపథ్యంలో... జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులివ్వడం శుభపరిణామం అని తెలిపారు. జగన్​కు అన్ని ఒక్కసారిగా ముంచుకొస్తున్నాయని.. ఏం జరుగుతుందో చూడాలని రఘురామ పేర్కొన్నారు. సీఐడీ చీఫ్ సంజయ్ (CID chief Sanjay), ఏఏజీ పొన్నవోలు దేశమంతా తిరిగి ప్రెస్‌మీట్లు పెట్టి చంద్రబాబు (Chandrababu) మాత్రం కేసుపై మాట్లాడొద్దంటారా? అంటూ ప్రశ్నించారు.  దిల్లీలోని హోటల్‌లో ప్రెస్‌మీట్‌కు డబ్బులెవరు కట్టారో చెప్పాలని రఘురామ డిమాండ్ చేశారు. ప్రజావేదిక నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం ఉన్నప్పుటికీ... జగన్‌ సీఎం కాగానే ప్రజావేదిక కూల్చారని ఆరోపించారు. ప్రజావేదిక కూల్చే హక్కులెవరిచ్చారో సీఆర్డీఏ (CRDA) అధికారులు చెప్పాలని ఎంపీ రఘురామ డిమాండ్ చేశారు. ప్రజావేదిక కూల్చివేతపైనా ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తామని ఆయన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.