సీఎం జగన్​ను కలిసేందుకు ఉదయం నుంచి తల్లీకుమారుల పడిగాపులు - చివరికి ఏం అయిందంటే? - అమీన్ పీర్ దర్గా వద్ద సీఎం వైఎస్ జగన్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2023, 7:20 PM IST

Mother and Son Meet CM Jagan at Kadapa Dargah: కడప పర్యటన కోసం వచ్చిన ముఖ్యమంత్రికి.. తమ సమస్య చెప్పుకోవాలని.. ఆ తల్లీకుమారులు ఉదయం నుంచి వేచి ఉన్నారు. తమ వినతులు సీఎంకు చేరతాయో లేదోనని గంటల తరబడి పడిగాపులు కాశారు. తల్లీకుమారుల గొంతు విన్న సీఎం కారు దిగి.. వినతిని స్వీకరించి సీఎంఓకు బదలాయించారు. కడపకు చెందిన బాషా.. ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తూ.. నాలుగేళ్ల కిందట మెడికల్ అన్‌ఫిట్ అయ్యారు. రెండేళ్ల కిందట మృతి చెందారు. నిబంధనల ప్రకారం అన్​ఫిట్ అయిన ఉద్యోగి పిల్లలకు.. కొలువు లేదా డబ్బులు ఇస్తారు. అయితే ఆ కుటుంబ సభ్యులు.. ఉద్యోగం కావాలని పట్టుబట్టారు. అప్పటి నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. ఉద్యోగం ఇవ్వకపోవటంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. 

కడప పెద్ద దర్గాకు సీఎం వస్తున్నారని తెలుసుకుని.. తల్లీకుమారులు ఉదయమే అక్కడకు చేరుకున్నారు. వాలంటీర్‌కు వినతిపత్రం ఇచ్చారు. కానీ అది ముఖ్యమంత్రికి చేరుతుందో లేదోనని.. అక్కడే కళ్లుకాయలు కాచేలా ఎదురుచూశారు. సీఎం దర్గాను సందర్శించి తిరిగి వెళ్తుండగా ఇద్దరూ.. సార్.. సార్ అంటూ గట్టిగా కేకలు వేయడంతో ముఖ్యమంత్రి కారు దిగారు. తల్లీకుమారులను పిలిచి మాట్లాడారు. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.