Monkeys Fight: నడిరోడ్డుపై కోతులు హల్చల్.. నువ్వా-నేనా అంటూ వార్ - కోతుల గ్యాంగ్‌ల ఘర్షణ
🎬 Watch Now: Feature Video
Monkeys Fight: వానరాలు గ్యాంగ్‌లు మెయింటైన్ చేస్తున్నాయా.. అవును మరి.. ఈ వీడియో చూస్తే మీకు కూడా ఇదే సందేహం రావచ్చు. ఇంతకీ ఏం జరిగిందంటే.. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కర్నూల్ రోడ్‌లోని ఓ టీ దుకాణం వద్ద.. కోతులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. రెండు గుంపులుగా విడిపోయిన వానరాలు.. కాసేపు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. నడి రోడ్డుపై బాహాబాహీకి దిగాయి. గట్టిగా అరుస్తూ, ఒక దానిపై మరొకటి దాడి చేసుకున్నాయి. దీంతో రోడ్డుపై వెళ్లే స్థానికులు పరుగులు పెట్టారు. స్థానికంగా నివసించేవారు భయంతో ఇంటి తలుపులు వేసుకున్నారు. దీంతో రోడ్డుపై వెళ్లేందుకు వాహనదారులు వెనుకంజ వేశారు. రెండు గుంపుల వానరాలు యుద్ధానికి దిగాయా అన్నట్లు ప్రవర్తించాయి. నడి రోడ్డపై సుమారు 20 నిమిషాల పాటు కోతుల అరుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. రోడ్డుపై కోతులు కూడా గ్యాంగ్‌లుగా విడిపోయి.. ఇలా కొట్టుకోవడంపై స్థానికులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ మీరు ఏం అంటారు మరి..!