Money Theft as Cinema Style: రూ.20 కోసం చూసుకుంటే.. రూ.10 లక్షలు కొట్టేశారు - three members group stolen ten lakh rupees
🎬 Watch Now: Feature Video
Rs.10 Lakhs theft from Man as Cinema Style: గుంటూరులో హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసి తీసుకెళ్లడానికి వచ్చిన ఓ వ్యక్తికి దొంగలు టోకరా పెట్టారు. బ్రాడిపేటలోని మిర్చి వ్యాపారి వద్ద హరిబాబు గుమాస్తాగా పని చేస్తున్నారు. శుక్రవారం నాడు యజమాని చెప్పడంతో లక్ష్మీపురం హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి రూ.10 లక్షలు విత్ డ్రా చేశారు. బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేసే సమయంలో ఓ ఆగంతుకుడు వచ్చి.. కింద 20 రూపాయల నోట్లు పడిపోయాయని చూపించాడు. ఆ నోట్లను తీసుకునేందుకు హరిబాబు ప్రయత్నిస్తుండగా.. రూ. 10 లక్షల నగదుతో ఉన్న బ్యాగును అదే ముఠాలోని మరొకడు చాకచక్యంగా ఎత్తుకెళ్లాడు.. పక్కనే బైక్‌పై వేచి ఉన్న మరో దొంగతో కలిసి పారిపోయాడు. హరిబాబు బైక్‌పై కూర్చున్న తర్వాత గానీ చోరీ విషయం గుర్తించలేదు. అప్పటికే దొంగలు పరారయ్యారు. హరిబాబు పట్టాభిపురం పోలీసులను ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బ్యాంక్‌తో పాటు బయట ఉన్న సీసీ టీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. బ్యాంకు లోపల ముగ్గురు వ్యక్తులు మాస్క్‌లు పెట్టుకుని మిగతా వారిని గమనిస్తున్నట్లు ఫుటేజీలో బయటపడింది. దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.