MLA Vasantha Krishnaprasad Warning: 'అవకాశమిస్తే ప్రజలకు సేవ చేస్తా.. లేకపోతే'.. అసమ్మతివాదులకు ఎమ్మెల్యే వసంత వార్నింగ్​ - Mylavaram Assembly constituency

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 21, 2023, 5:41 PM IST

MLA Vasantha Krishnaprasad Warning: ఎన్టీఆర్ జిల్లా మైలవరం వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన ఛైర్మన్ నియామకం సందర్భంగా అసమ్మతి వాదులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో రాజకీయాన్ని వేడెక్కించాయి. తాను ఎంత సౌమ్యంగా ఉంటానంటూనే.. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. భయపెట్టో, మరో రకంగానో వసంత కృష్ణప్రసాద్​ని లొంగదీసుకోవాలనుకుంటే ఈ జన్మకి సాధ్యపడే పని కాదని ఆయన అన్నారు. పదవులు ఇచ్చిందాకా నక్క వినయాలు ప్రదర్శించి.. ఇప్పుడు కుటిల బుద్దులు చూపుతున్నారని మండిపడ్డారు. వర్గాలు లేకుండా ఉండాలనుకుంటే తనకు వర్గాలను అంటగడుతున్నారని ఆరోపించారు. అత్యంత నిజాయితీగా ఉండే ఎమ్మెల్యేల్లో తాను ఒకడినన్న ఆయన.. అవకాశం ఇస్తే రాజకీయాల్లో ప్రజలకు సేవ చేస్తా,.. లేకపోతే తాను నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యంలో వ్యాపారాలు చేసుకుంటానన్నారు. గతంలోనే అధిష్టానానికి అన్నీ చెప్పాను.. ఇకపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ఆలోచన లేదని చెప్పారు. నేనేంటో వాళ్లకి తెలుసు.. కుతంత్రాలు చేసే వాళ్లకూ తెలుసు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటే ఫైనల్ అని వసంత కృష్ణప్రసాద్‌ అన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.