ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరుడు వీరంగం - పట్టించుకోని పోలీసులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 2, 2024, 2:53 PM IST
MLA Kethireddy Follower Rudeness in Dharmavaram Government Hospital : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి అనుచరుడు వినయ్ గౌడ్ వీరంగం సృష్టించిన సంఘటన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. ఆస్పత్రిలో గాయాలతో చికిత్స పొందుతున్న వైసీపీ వర్గీయుల కోసం వెళ్లిన వినయ్ గౌడ్ మద్యం మత్తులో వైద్య సిబ్బందితో గొడవకు దిగారు. ఆస్పత్రిలో దౌర్జన్యం ఏంటని ప్రశ్నించిన సిబ్బందిపై ఆగ్రహించారు.
Hospital Staff fire on Police: మద్యం మత్తులో ఉన్న వినయ్ గౌడ్ ఆస్పత్రి ఎమ్మెర్జెన్సీ విభాగం తలుపుల అద్దాలు పగలగొట్టారు. దీంతో వైద్య సిబ్బంది స్థానిక పోలీసు అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వైసీపీ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అక్కడి నుంచి పంపించే వేశారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.