MLA Eluri Sambasiva Rao Letter to EC on Deletion of Votes: ఈసీకి ఎమ్మెల్యే ఏలూరి మరో లేఖ.. ఓట్లు తొలగిస్తున్నారని ఫిర్యాదు - EluriSambasivaRao letter to EC ondeletion of votes
🎬 Watch Now: Feature Video
MLA Eluri Sambasiva Rao Letter to EC on Deletion of Votes: ఓట్ల తొలగింపులో వైసీపీ అక్రమాలకు పాల్పడిందంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మరో లేఖ రాశారు. పర్చూరు నియోజకవర్గంలో 7వేల ఓట్లు తొలగించేందుకు ఫామ్ 7 దరఖాస్తులు చేశారన్నారు. ఆన్‌లైన్‌లో కొందరి వ్యక్తుల ప్రమేయం లేకుండా భారీగా దరఖాస్తులు చేశారని ఆరోపించారు. ఒక్కొక్క బూత్‌లో ఒకే వ్యక్తి పేరుతో ఆన్‌లైన్‌లో వందల సంఖ్యలో దరఖాస్తులు చేశారన్నారు. అధికార పార్టీ ఎన్నికల సంఘం మార్గదర్శకాల ఉల్లంఘనకు పాల్పడుతుందని ఏలూరి సాంబశివరావు విమర్శించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆన్‌లైన్‌లో చేసిన దరఖాస్తుల విచారణ నిలపాలని కోరారు. ఓట్ల తొలగింపులో క్షేత్రస్థాయిలో అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఇటీవల ఓట్ల తొలగింపులు అధికారులు ప్రమేయంపై ఆధారాలతో ఎమ్మెల్యే ఏలూరి ఫిర్యాదు చేశారు. తాజాగా అధికార పార్టీ దురుద్దేశంతో పాల్పడిన అవకతవకలు సాక్ష్యాలతో నిరూపించారు. తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు. నియోజకవర్గ వ్యాప్తంగా అర్హుల ఓట్లు తొలగించేలా అవకతవకలకు పాల్పడుతున్నారన్నారు. ఓట్ల అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. ఎన్నికల విధులకు సంబంధం లేని వాలంటీర్ల ద్వారా క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్నారన్నారు. తన ఓటును తానే తొలగించుకుంటున్నట్లు ఓటర్ల పేరుతో దొంగ దరఖాస్తులు చేస్తున్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసమే అధికార పార్టీ ఓట్ల తొలగింపునకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆన్‌లైన్‌లో అక్రమంగా వ్యక్తుల పేరుతో వందల సంఖ్యలో దరఖాస్తుల వివరాలతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు లేఖలో పేర్కొన్నారు.
TAGGED:
MLA Eluri Sambasiva Rao