MLA Anil Kumar Yadav Reacts on Illegal Mining అక్రమ మైనింగ్‌పై ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు - MLA Anil Kumar Yadav
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 23, 2023, 6:40 PM IST
MLA Anil Kumar Yadav Reacts on Illegal Mining in Saidapuram: నెల్లూరు జిల్లా సైదాపురంలోని అక్రమ మైనింగ్‌పై ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఆరు నెలలుగా సైదాపురంలో అక్రమ మైనింగ్ చేస్తున్నది ఎక్కువగా టీడీపీ నాయకులే అని అనిల్ ఆరోపించారు. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. గత ఆరు నెలల నుంచి ఈ అక్రమాలు అధికమయ్యాయని విమర్శించారు. అక్కడ వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జి రామ్ కుమార్ రెడ్డికి అవగాహన లేకపోవడం దాన్ని ఆసరాగా తీసుకుని అక్రమ మైనింగ్ చేస్తున్నారని విమర్శించారు. అక్రమ మైనింగ్‌లో రాపూర్ సీఐ, స్థానిక ఎమ్మార్వో టీడీపీ నాయకులకు పూర్తిగా సహకరిస్తున్నారని ఆరోపించారు. పూర్తి ఆధారాలతో రెండు రోజుల్లో సీఎంని కలుస్తున్నానని అన్నారు. అత్యధికంగా జోగిపల్లి మండలంలో అక్రమ మైనింగ్ చేస్తున్నారని అన్నారు. కొంత మంది వైసీపీ నాయకులను కలుపుకొని టీడీపీ అక్కడ అక్రమ మైనింగ్ చేస్తూ అందరిని బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. కలెక్టర్ రెండు రోజుల కిందట 14 వాహనాలను క్వారీల్లో సీజ్ చేశారని.. వాటిని వదిలి పెడితే మళ్లీ ఊర్ల మీద పడ్డాయని చెప్పారు.