మమ్మల్నే అడ్డుకుంటావా- మంత్రికి చెప్పి నీపై చర్యలు తీసుకుంటాం! పోలీసుతో మంత్రి అనుచరుడి వాగ్వాదం - ILLEGAL SAND TRANSPORT
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 13, 2024, 4:48 PM IST
Minister Roja Follower Warning to Police: వైసీపీ నేతలు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్నదే కాకుండా, అడ్డొచ్చిన పోలీసులను సైతం బెదిరిస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా నగరి పరిధిలోని కుశస్థలి నదిలో కొన్నిరోజులుగా వైసీపీ నేతలు అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఇవాళ ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న పోలీసులపై మంత్రి రోజా అనుచరుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇసుక ట్రాక్టర్లు ఎందుకు అడ్డుకుంటున్నారని మీపై చర్యలు తప్పమని మంత్రి అనుచరుడు హెచ్చరించారు.
మమ్మల్ని ఆపడానికి నువ్వెవరంటూ దౌర్జన్యం చేస్తూ వాగ్వాదానికి దిగాడు. ఎక్కడి నుంచో వచ్చి మమ్మల్నే అడ్డుకుంటావా అంటూ పోలీస్‌ను బెదిరించారు. మంత్రికి చెప్పి చర్యలు తీసుకుంటామని వైసీపీ నాయకుడు హెచ్చరించారు. స్టేషన్‌కు వచ్చి సీఐతో మాట్లాడాలని పోలీస్ చెప్పినా మంత్రి అనుచరుడు వినలేదు. మీరే మంత్రి వద్దకు వచ్చి సంజాయిషీ చెప్పుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీస్‌తో మంత్రి అనుచరుడు వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.