Minister Peddireddy Comments: చంద్రబాబు గెలవాలంటే ఐదారు పార్టీల మద్దతు కావాలి: మంత్రి పెద్దిరెడ్డి - ఏపీ ప్రధానవార్తలు
🎬 Watch Now: Feature Video
Minister Peddireddy Ramachandra Reddy Comments : ఐదారు పార్టీల మద్దతు ఉంటే గానీ గెలవలేని దుస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారని అనంతరం జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ నిర్వహించిన విజయోస్తు సభకు రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఏ స్థాయిలో విజయం సాధిస్తామో ఈ సభ చూస్తే అర్థం అవుతుంది అని అన్నారు. ఉషశ్రీ చరణ్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా, మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి కూడా తొలగించిన ఘనత తెలుగుదేశం పార్టీకి చెల్లిందన్నారు. చంద్రబాబు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి గంట పాటు చర్చలు జరిపారని చెప్పిన మంత్రి పెద్దిరెడ్డి... ఐదారు ఊత కర్రలతో నడిచే చంద్రబాబు రాజకీయంగా నిలబడలేరని అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. తాము 2019లో ఎలా విజయం సాధించామో, అదే విధంగా వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.