Minister Kottu Satyanarayana on Rushikonda రుషికొండపై భవనాలు రాజధానికి సంబంధించినవే.. : డిప్యూటీ సీఎం కొట్టు - Deputy Chief Minister Kottu Satyanarayana

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 23, 2023, 1:00 PM IST

Updated : Aug 23, 2023, 1:59 PM IST

Kottu Comments on Rushikonda Buildings : రుషికొండలోని నిర్మాణాలు పాలనా రాజధానికి సంబంధించిన అధికారిక భవనాలేనని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. అక్కడ నిర్మిస్తున్న భవనాలు ప్రైవేటు వ్యక్తులవి కావని అన్నారు. ఈ వ్యవహారం పై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. త్వరలోనే అక్కడకు పాలన రాజధాని తరలిపోయేందుకు వీలుగా నిర్మాణం జరుగుతోందని అన్నారు. రుషికొండపై సచివాలయ భవనం నిర్మిస్తున్నారంటూ..  ఆగస్టు 12న ట్వీట్ చేసిన వైసీపీ.. ఆ వెంటనే దానిని తొలగించింది. రుషికొండపై చేపట్టిన నిర్మాణాలు సచివాలయ భవనాలు కాదని, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలుగా పరిగణించాలని గంటల వ్యవధిలో మరో ట్వీట్ చేసింది. అయితే..  ఆ భవనాలను ఎందుకోసం నిర్మిస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ చెప్పలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ ట్వీట్ చేయడం, ఆ వెంటనే తొలగించటంపై ప్రతిపక్షం విమర్శలు గుప్పించింది. ఆ ట్వీట్​ను భయంతో తొలగించారా.. లేక ముఖ్యమంత్రి నుంచి కోటింగ్​ పడిందా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాగా, తాజాగా మంత్రి కొట్టు సత్యనారాయణ.. రిషికొండలోని నిర్మాణాలు పాలనా రాజధానికి సంబంధించిన అధికారిక భవనాలేనని చెప్పడం మరోసారి చర్చనీయాంశమైంది.

Last Updated : Aug 23, 2023, 1:59 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.