Minister Kakani tomato distribution: "మార్కెట్లలో సబ్సిడీ టమాటా.. రూ.3కోట్ల రాయితీ భరిస్తున్న ప్రభుత్వం" - టమాట సబ్సిడీ
🎬 Watch Now: Feature Video
Minister Kakani subsidized tomato distribution: ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 600 టన్నులు టమాటాలను సేకరించి రైతు బజార్ల ద్వారా వినియోగదారులను అందిస్తోందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. చిత్తూరు, మదనపల్లి మార్కెట్లలో రైతుల వద్ద నుంచి కేజీ 90 రూపాయల నుంచి 120 రూపాయలకు కొనుగోలు చేసి రైతు బజార్లో కేజీ 50 రూపాయలకే రాయితీపై అందిస్తున్నామన్నారు. కృష్ణలంక రైతు బజార్ లో రాయితీపై ఇస్తున్న టమాటాల పంపిణీని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. రాయితీపై వినియోగదారులకు టమాటాలను అందించేందుకు ప్రభుత్వం 3 కోట్ల మేర రాయితీని భరించిందని చెప్పారు. దేశంలో పంట దిగుబడి లేకపోవడంతో టమాటా రేట్లు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం 103 రైతు బజార్ల ద్వారా రోజుకు 65 నుంచి 70 టన్నుల టమాటాలను విక్రయిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఎన్ని రోజులు టమాటా ధరలు అధికంగా ఉంటాయో.. అన్ని రోజులు ప్రభుత్వం రాయితీతో వినియోగదారులకు సరఫరా చేస్తుందని మంత్రి కాకాని చెప్పారు.