Minister Dharmana Prasada Rao on Men Welfare schems మగవారి సంక్షేమ పథకాలపై మంత్రి ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు - Minister Dharmana Prasada Rao news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 28, 2023, 10:57 PM IST

Minister Dharmana Prasada Rao Key Comments on Men's Welfare Schemes: మగవారికి సంక్షేమ పథకాలు ఇస్తే, నిధులు దుర్వినియోగం అవుతాయని.. రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం స్త్రీలను గౌరవించి అనేక పథకాలు తీసుకువచ్చిందన్నారు. రానున్న ఎన్నికల్లో తాము స్నేహితులుగా ఉండాలో.. సేవకులుగా ఉండాలో.. ప్రజలే తేల్చాలని అన్నారు. 

Dharmana Prasada Comments: శ్రీకాకుళం జిల్లా మంగువారితోట సచివాలయ పరిధిలో గురువారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం సభలో మంత్రి ప్రసంగిస్తూ.. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ''జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ధరలు పెరిగాయని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. ధరలు దేశమంతటా పెరిగాయి. ఆ ధరలు పెంచింది మేము కాదు, కేంద్రంలో ఉన్నవాళ్లు. మా ప్రభుత్వం.. కుటుంబానికి అండగా, ఓపికగా, శక్తిగా ఉండే స్త్రీలకు మంచి గౌరవం కల్పించింది. మగవారికి సంక్షేమ పథకాలు ఇస్తే.. నిధులు దుర్వినియోగం అవుతాయని తెలిసి.. స్త్రీల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాం. నేరుగా స్త్రీల అకౌంట్లలోనే డబ్బులు వేస్తున్నాం. మా ప్రభుత్వం ఇస్తున్న డబ్బుల వలన నిధులు దుర్వినియోగం అవుతున్నాయని చెబుతున్న వారికి ఓటు వేస్తారా..?, లేక మాకు ఓటు వేస్తారా..? ఇది ప్రజలే తేల్చుకోవాలి. రానున్న ఎన్నికల్లో మేమంతా స్నేహితులుగా ఉండాలో, సేవకులుగా ఉండాలో ప్రజలే తేల్చాలి.''  అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.