Minister Botsa Satyanarayana on GPS: జీపీఎస్ అందరికీ ఆమోదయోగ్యమని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు: మంత్రి బొత్స - Andhra Pradesh govt news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 23, 2023, 4:59 PM IST
Minister Botsa Satyanarayana on GPS: రాష్ట్ర వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా 'జీపీఎస్ వద్దు-ఓపీఎస్సే ముద్దు' అంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు నిరసనలు, ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకువచ్చిన గ్యారెంటీడ్ పెన్షన్ పథకాన్ని (జీపీఎస్) వెంటనే రద్దు చేసి.. దాని స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ జీపీఎస్‌పై స్పందిస్తూ.. సీపీఎస్, జీపీఎస్, ఓపీఎస్‌లు అనేవి ముగిసిపోయిన అంశమన్నారు.
Minister Botsa Comments: జీపీఎస్ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి మీడియాతో మాట్లాడారు. జీపీఎస్ అందరికీ ఆమోదయోగ్యం అని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదన్నారు. సీపీఎస్, జీపీఎస్ అనేది ఇక ముగిసిపోయిన అంశమన్నారు. భవిష్యత్ తరాలపై భారం పడకూడదనే జీపీఎస్ తీసుకువచ్చామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ తాలుకా విధానం జీపీఎస్సే అని ఆయన తేల్పిచెప్పారు.''పలుమార్లు ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో.. పెన్షన్‌పై గ్యారెంటీ కావాలని అడిగారు. తర్వాత ఫ్యామిలీ గ్యారెంట్ కావాలని అడిగారు. తర్వాత హెల్త్ కావాలని అడిగారు. వారు అడిగిన ప్రశ్నలంటినీ పరిగణలోకి తీసుకుని ఓ ఫైల్ తయారు చేశాం. చివరికీ ప్రభుత్వం ఎంత చేయగలదో అంతా వరకు చేసి ఇచ్చాం.'' అని మంత్రి బొత్స అన్నారు.