Minister Botsa on Social Justice Bus Yatra: ఈనెల 26 నుంచి మూడు ప్రాంతాల్లో 'సామాజిక న్యాయ బస్సు యాత్ర': మంత్రి బొత్స - botsa comments on pawan kalyan

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 22, 2023, 12:48 PM IST

Minister Botsa on Social Justice Bus Yatra: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మెుదటి దశగా 12 రోజుల పాటు 'సామాజిక న్యాయ బస్సు' యాత్ర చేపట్టనున్నామని.. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ బస్సు యాత్రలో నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు జరిగిన సంక్షేమాన్ని వివరించనున్నామన్నారు. అనంతరం బైజుస్ విషయంలో పవన్ కల్యాణ్ తెలియకుండా మాట్లాడుతున్నారని, మద్యపాన నిషేధం దశల వారీగా అమలు చేస్తామని మంత్రి బొత్స వివరించారు.

Botsa Satyanarayana Comments: విశాఖ గ్రాండ్‌ బేలో వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ.. సామాజిక బస్సు యాత్ర, నూతన విద్యావిధానం, మద్యపాన నిషధం గురించి ప్రస్తావించారు. ''నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు జరిగిన సంక్షేమాన్ని వివరించేందుకు సామాజిక న్యాయ బస్సు యాత్ర చేపట్టబోతున్నాం. ముందుగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో 12 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. నూతన విద్యావిధానంపై పవన్ కల్యాణ్ తెలియకుండా మాట్లాడుతున్నారు. ఆయనకు తెలియకపోతే ట్యూషన్ చెప్పించుకోవాలి.  నా వద్దకు వస్తే పవన్‌ కల్యాణ్‌కు ట్యూషన్‌ చెబుతా. మద్యపాన నిషేధం దశలవారీగా అమలు చేస్తామని చెప్పాం. మద్యం ధరలు పెంచితే ప్రతిపక్షాలకు ఉలుకెందుకు..? డబ్బు మదంతో ఉన్న వాళ్లే మద్యం జోలికి వెళ్తారు. ఖరీదైన మద్యం పేదలకు దూరంగానే ఉంటుంది'' అని మంత్రి బొత్స అన్నారు.

''ఈనెల 26 నుంచి సామాజిక న్యాయ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ఈ బస్సు యాత్ర మొదలవుతుంది. ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభలు నిర్వహిస్తాం. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో ఈ బస్సు యాత్ర ఉంటుంది.''- వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ సమన్వయకర్త

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.